CM KCR: మోదీ 2024లో నువ్వు ఇంటికి.. మేం ఢిల్లీకి
CM KCR: ప్రశ్నించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్‌ఎస్
CM KCR: మోదీ 2024లో నువ్వు ఇంటికి.. మేం ఢిల్లీకి
CM KCR: ఖమ్మంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభా వేదికగా ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ శంఖారావం పూరించారు. ప్రశ్నించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్‌ఎస్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో భారత్‌ను వెలుగు జిలుగుల దేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తెలంగాణ రైతుబంధు లాంటి స్కీమ్ దేశమంతా అమలు చేయాలనేదే బీఆర్‌ఎస్ నినాదమన్నారు. 2024 తర్వాత మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి అంటూ సీఎం కేసీఆర్ ఖమ్మం సభా వేదికగా తేల్చిచెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని సభా వేదికగా హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.