TSRTC Strike : ప్రైవేటు బస్సుల పర్మిట్లపై నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్

-ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతోన్న కేసీఆర్ సమీక్ష -ఇప్పటికే 5,100 సర్వీసుల ప్రైవేటీకరణపై చర్చ -మరో 5వేల సర్వీసుల ప్రైవేటీకరణపై ప్రకటన -ముగిసిన ఆర్టీసీ డెడ్‌ లైన్ విధుల్లో చేరింది సుమారు 360 మంది ఆర్టీసీ సమ్మెపై రేపు హైకోర్టులో విచారణ

Update: 2019-11-06 06:32 GMT


ఆర్టీసీ సమ్మె 33వ రోజు కొనసాగుతోంది. విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ రెండోసారి ఇచ్చిన డెడ్ లైన్ ను కార్మికులు భేఖాతరు చేశారు. ఆర్టీసీలో మొత్తం 49,733 మంది మొత్తం మంది కార్మికులుండగా.. సుమారు 360 మంది విధులకు హాజరయ్యారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. కార్మికులకు ఇచ్చిన గడువు ముగియడంతో ప్రైవేటు బస్సుల పర్మిట్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం సాయంత్రం లోపు ప్రకటన చేసే అవకాశం ఉంది. రేపు హైకోర్టులో దీనిపై అన్ని విషయాలు సమర్పించాలని నిర్ణయించారు. డెడ్ లైన్ ముగిసిన తర్వాత ఆర్టీసీ ఉండదని సీఎం ప్రకటించడంతో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. 

Tags:    

Similar News