17న హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ బహిరంగసభ

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. త్వరలోనే అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ విప్ రాజేశ్వర రెడ్డి వెల్లడించారు.

Update: 2019-10-15 00:39 GMT

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. త్వరలోనే అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ విప్ రాజేశ్వర రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర రెడ్డి ఉత్తమ్ పై నిప్పులు చెరిగారు. ఓడిపోతామన్న భయంతో ఉత్తమ్ స్థానిక టీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని రాజేశ్వర రెడ్డి
కోరారు.

హుజూర్‌నగర్ ఉపఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఉంటే , కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు, టీడీపీ కిరణ్మయి పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం అధికార టీఆర్ఎస్, పత్రిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉంది. ఈనెల 21న హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక జరగనుంది. 24న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు హుజూర్‌నగర్‌ ఉపఎన్నికను సవాలుగా తీసుకున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ కూడా అక్కడ సభ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్ తెలియజేయడంతో పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

Tags:    

Similar News