CM KCR: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డి

Command Control Centre: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కర్త, రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డేనని, సీసీసీ నిర్మాణం కోసం ఆయన ఎంతో శ్రమించారని అన్నారు సీఎం కేసీఆర్.

Update: 2022-08-04 11:16 GMT

CM KCR: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డి

Command Control Centre: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కర్త, రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డేనని, సీసీసీ నిర్మాణం కోసం ఆయన ఎంతో శ్రమించారని అన్నారు సీఎం కేసీఆర్. పోలీస్‌ యంత్రాంగం ఎంత పటిష్టంగా ఉంటే పౌర సమాజం అంత భరోసాగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని శాంతిభద్రతల నిలయంగా ముందుకు తీసుకెళ్తున్నామన్న సీఎం కేసీఆర్ సమాజ హితం కోసం సంస్కరణలు తీసుకొస్తున్న పోలీసులను అభినందించారు. సైబర్‌ క్రైమ్స్‌ ప్రపంచానికే సవాల్‌గా మారాయని, సైబర్‌ నేరగాళ్లు ఎక్కడో ఉండి ఇక్కడ నేరాలు చేస్తున్నారన్నారు.

సైబర్‌ క్రైమ్‌ కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో నేరాలు తగ్గాయని, తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉందన్నారు. పేకాట నిర్మూలనలో 99శాతం సక్సెస్‌ అయ్యామన్న కేసీఆర్ గుడుంబాను అరికట్టామని చెప్పారు. రానున్న రోజుల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు సీఎం కేసీఆర్.

Tags:    

Similar News