CM KCR: సీఎం కేసీఆర్ మెదక్ టూర్ వాయిదా

CM KCR: వాయిదా పడిన పర్యటన ఈ నెల 23కు రీషెడ్యూల్

Update: 2023-08-17 02:16 GMT

CM KCR: సీఎం కేసీఆర్ మెదక్ టూర్ వాయిదా

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్ష సూచనల నేపథ్యంలో- ఈ మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ పోస్ట్‌పోన్ అయింది. వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్షాల నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేసినట్లు సీఎంవో కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. వాయిదా పడిన పర్యటనను ఈ నెల 23వ తేదీకి షెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్ని్కలను దృష్టిలో ఉంచుకుని కొంతకాలంగా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే ఆయన మంచిర్యాల, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించారు. ఈ నెల 19న తన సొంత జిల్లా ఉమ్మడి మెదక్‌తో పాటు, సూర్యాపేట జిల్లాకు బయలుదేరాల్సి వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో ఈ నెల 19న తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టూర్‌ను వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ నెల 23కు షెడ్యూల్ చేశారు.

Tags:    

Similar News