కేటీఆర్‌ సీఎం ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌

*సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దు -కేసీఆర్‌ *పరిధి దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు -కేసీఆర్‌

Update: 2021-02-07 12:07 GMT

కేటీఆర్‌ సీఎం ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. కేటీఆర్‌ సీఎం అన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు కేసీఆర్‌. తానే సీఎంగా కొనసాగుతానని, సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని అన్నారు. పరిధి దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేసీఆర్‌. ఏప్రిల్‌లో టీఆర్ఎస్‌ బహిరంగసభ ఉంటుందని, 6 లక్షల మందితో సభ ఏర్పాటు జరుగుతుందన్నారు. ప్రతి ఎమ్మెల్యే 50వేల సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు కేసీఆర్‌. అలాగే నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News