CM KCR: తెలంగాణ నూతన సచివాలయంలో తొలి సమీక్ష

CM KCR: పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష

Update: 2023-05-01 02:49 GMT

CM KCR: తెలంగాణ నూతన సచివాలయంలో తొలి సమీక్ష 

CM KCR: అట్టహాసంగా ప్రారంభమైన.. డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తొలి సమీక్ష జరగనుంది. సీఎం సమావేశ మందిరంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సమీక్ష నిర్వహించనున్నట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే.. కొత్త పరిపాలనా సౌధంలో.. తొలిసారి నిర్వహిస్తున్న సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమీక్షా సమావేశంలో కరివేన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్‌పూర్, కొడంగల్, వికారాబాద్‌కు వెళ్లే తాగునీటి కాల్వల గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఈఎన్సీ, చీఫ్ ఇంజినీర్లు పాల్గొననున్నారు. అయితే.. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా.. సీఎం ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. మొత్తం ఆరు ఫైళ్ల మీద సంతకం చేశారు. అందులో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫైలు కూడా ఉంది. దీంతో.. ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో.. కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News