CM KCR: ప్రధాని మోడీ ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి

CM KCR: పార్లమెంట్‌లో కేంద్ర ఆర్డినెన్స్ ఆమోదాన్ని అడ్డుకుంటాం

Update: 2023-05-27 11:00 GMT

CM KCR: ప్రధాని మోడీ ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి

CM KCR, Ordinance, Modi, Delhi

CM KCR: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీతో గెలిచినా...మేయర్ పదవి చేపట్టకుండా బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు సీఎం కేసీఆర్. అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలని కోర్టు చెప్పిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు పర్యటించారు. ప్రగతిభవన్‌కు చేరుకున్న కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌సింగ్.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేజ్రీవాల్.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతున్నారు.

ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో ఇద్దరు సీఎంలతో కలిసి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కాలరాసే విధంగా ఆర్డినెన్స్ తీసుకోచ్చారని...ప్రధాని మోడీ ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News