CM Jagan: విద్యారంగంపై పెట్టుబడులతో మానవ వనరుల అభివృద్ధి

CM Jagan: నాడు- నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్ల భౌతిక స్వరూపం మార్చాం

Update: 2022-09-20 10:00 GMT

CM Jagan: విద్యారంగంపై పెట్టుబడులతో మానవ వనరుల అభివృద్ధి

CM Jagan: విద్యారంగంపై పెట్టుబడులు మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతాయని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. విద్యారంగంలో నాడు-నేడుపై జరిగిన చర్చలో విద్యాప్రగతిలో ప్రభుత్వ బాధ్యత, విద్యాసంస్కరణలతో సాధించే ఫలితాలను సభలో ప్రస్తావించారు. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్ల భౌతిక స్వరూపాన్ని మార్చి, మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన ప్రమాణాలతో విద్యాబోధనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

గతంలో పాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత ఊళ్లో ఉన్న స్కూలును పట్టించుకోలేదని ఈ సందర్భంగా సభలో ఫోటోను ప్రదర్శించారు. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహించిన కుప్పంలోనూ స్కూళ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లను వినూత్నంగా తీర్చి దిద్దే విషయంలో ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేవిషయంలో దశలవారీగా ప్రగతి సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు.

Tags:    

Similar News