Bhatti Vikramarka: కార్పొరేట్ స్నేహితుల కోసం ప్రధాని ప్రజలపై పన్నులు, ధరల భారాలు మోపుతున్నారు..
Bhatti Vikramarka: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజ సంక్షేమంలో లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
Bhatti Vikramarka: కార్పొరేట్ స్నేహితుల కోసం ప్రధాని ప్రజలపై పన్నులు, ధరల భారాలు మోపుతున్నారు..
Bhatti Vikramarka: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజ సంక్షేమంలో లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నిరసనల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంబానీ అదానీల కోసం కేంద్రం.. ప్రజలపై అనవసరమైన భారాలు మోపుతోందన్నారు. ఇప్పటికైనా పెంచిన చమురు, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకంటే కాంగ్రెస్ ఆద్వర్యంలో నిరసలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.