Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్..తెలంగాణ లక్ష్యాలు నెరవేరడంలేదు..
Bhatti Vikramarka: బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి.
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్..తెలంగాణ లక్ష్యాలు నెరవేరడంలేదు..
Bhatti Vikramarka: భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం, స్వాతంత్రం, భావ స్వేచ్ఛను తెచ్చుకోలేక పోయామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, అమ్మ హస్తం వంటి పథకాలు కూడా అందని పరిస్థితి కేసీఆర్ పాలనలో నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి ఆ చట్టాన్ని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దళిత బంధుకు 17వేల 700 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి, ఏడాది పూర్తయినా నిధులు విడుదల చేయలేదు.