Heart Attack: గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి

Update: 2025-02-21 03:00 GMT

 Heart Attack: గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి

Heart Attack: కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని శ్రీనిధి చదువు నిమిత్తం కామారెడ్డిలోని కల్కినగర్ లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి భోజనం చేయకుండా టిఫిన్ బాక్స్ తో ఆమె స్కూల్ కు వెళ్లింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకుని విద్యార్థినిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ సీపీఆర్ చేస్తూ చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయిందని పాఠశాల యాజమాన్యం, డాక్టర్లు తెలిపారు. 

Tags:    

Similar News