Telangana: ఎంత దారుణం.. వాట్సాప్‌లో నచ్చని ఎమోజీ పెట్టినందుకు ఒక వ్యక్తిని చంపేస్తారా? సమాజం ఎటువెళిపోతుంది?

Telangana: ఈ మధ్య ఎవరు , ఎవర్ని, ఎప్పుడు, ఎలా చంపుతారో తెలియడంలేదు. ఏదో రకంగా కక్ష సాధించుకోవాలనే చూస్తున్నారు.

Update: 2025-07-23 07:30 GMT

Telangana: ఎంత దారుణం.. వాట్సాప్‌లో నచ్చని ఎమోజీ పెట్టినందుకు ఒక వ్యక్తిని చంపేస్తారా? సమాజం ఎటువెళిపోతుంది?

Telangana: ఈ మధ్య ఎవరు , ఎవర్ని, ఎప్పుడు, ఎలా చంపుతారో తెలియడంలేదు. ఏదో రకంగా కక్ష సాధించుకోవాలనే చూస్తున్నారు. నిండు ప్రాణాలను తీయాలని చూస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి వాట్సాప్‌లో డిస్ లైక్ చేసినట్టు ఒక వాట్సాప్ ఎమోజీ పెట్టడమే అతని చావుకు కారణం అయింది. ఆ తప్పే అతన్ని బలితీసుకుంది. ఈ దారుణం నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

సూర్యపేటలో ఉన్న పద్మశాలి సంఘం ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియను పూర్తిచేసింది. వచ్చే నెల 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కాలంగా సంఘంలో ఉన్న విభేదాలు మరింత ముదిరిపోయాయి. ప్రస్తుత పట్టణ అధ్యక్షుడిగా ఉన్న అప్పం శ్రీనివాస్‌తో పాటు పట్టణ అధ్యక్ష పదవికి శ్రీరాములు అనే వ్యక్తి నామినేషన్ వేశారు.

సూర్యాపేట పట్టణ సద్మశాలి బంధువులందరికీ ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్‌లో శ్రీనివాసులు, శ్రీరాములు ఇరువురు వివిధ పోస్టులు పెట్టుకుంటారు. అయితే తాజాగా శ్రీనివాస్‌ను కామెంట్ చేస్తూ శ్రీరాములు పోస్ట్‌లు పెడుతున్నాడు. శ్రీనివాస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి నుండి నిధులను కాజేసాడని పోస్ట్ పెట్టాడు. ఇందుకు బదులుగా అప్పం శ్రీనివాస్ బదులు ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ పోస్ట్‌కు మద్దతుగాఈ భగత్ సింగ్ నగర్‌‌కు చెందిన మానుపురి కృపాకర్(54) క్లాప్స్ కొడుతున్న ఒక ఎమోజీని పెట్టాడు. ఈ ఎమోజీని చూసిన తర్వాత రాములు రెచ్చిపోయాడు. కృపాకర్‌‌కు ఫోన్ చేసి దూషించాడు. దీంతో మనస్తాపానికి గురైన కృపాకర్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు పద్మశాలీ భవనానికి వెళ్లాడు. అయితే అప్పటికి అక్కడే ఉన్న రాములు, రాముడు కుమారుడు, రాముడు అనుచరులు.. కృపాకర్‌‌పై దాడికి దిగారు. ఈ దాడిలో కృపాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ తర్వాత హాస్పిటల్‌కి తరలిస్తుండగానే మధ్యలో చనిపోయాడు. భాద్యుతుల ఫిర్యాదు మేరకు రాములు, అతని కుమారుడు, అనుచరులపై కేసును నమోదు చేసారు.

Tags:    

Similar News