Andhra Pradesh: నారాయణ నివాసంలో సీఐడీ సోదాలు
Andhra Pradesh: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, నెల్లూరులో ఏకకాలంలో తనిఖీలు చేశారు.
మినిస్టర్ నారాయణ (ఫోటో: ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, నెల్లూరులో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఇవాళ నారాయణకు నోటీసులు ఇచ్చిన సీఐడీ 22న హాజరుకావాల్సిందిగా నోటీస్‌లో పేర్కొన్నారు. సీఐడీ సైబర్ సెల్ విభాగం డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే కేసుకు సంబంధించి ఈనెల 23న విచారణకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.