ACB Raids: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై, హోంగార్డు

ACB Raids: నరేందర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎస్‌‌‌‌ఐ, హోంగార్డుపై సస్పెన్షన్ వేటు వేసేందుకు చర్యలు

Update: 2023-10-07 04:30 GMT

ACB Raids: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై, హోంగార్డు

ACB Rides: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో పబ్‌ల నుంచి అక్రమ వసూళ్ల కేసును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సీఐ, ఎస్‌ఐ, హోంగార్డులను నిన్నటి నుంచి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్‌‌‌‌లోని రాక్‌‌‌‌ క్లబ్ స్కైలాంజ్‌‌‌‌ పబ్‌ నుంచి ci నరేందర్ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఐ వేధింపులు భరించలేక బాధితుడు లక్ష్మణ్‌‌‌‌రావు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో సీఐ, ఎస్‌ఐ, హోంగార్డుల అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్స్‌‌‌‌, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌‌‌‌ను ఏసీబీ అధికారులకు అందించాడు. నరేందర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎస్‌‌‌‌ఐ, హోంగార్డుపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు.

Tags:    

Similar News