Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరుకానున్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరుకానున్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి రాజకీయ నేతను విచారించనున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు.
మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్‌రెడ్డి విచారణ ఉండే ఛాన్స్ ఉంది. ఇదే కేసులో లింగయ్య విచారణ తర్వాత మరో మాజీమంత్రికి నోటీసులిచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.