ప్రియాంక హత్యా ఘటనకు నిరసనగా చిలుకూరు ఆలయం మూసివేత

నోరు లేని మూగ జీవాలకు వైద్యం అందించే డాక్టర్ ప్రియాంకను నలుగురు కామాంధులు కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Update: 2019-12-01 06:22 GMT
చిలుకూరు బాలాజీ దేవాలయం

నోరు లేని మూగ జీవాలకు వైద్యం అందించే డాక్టర్ ప్రియాంకను నలుగురు కామాంధులు కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది చాలా రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. కొంత మంది ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి కలింగించాలని, దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని క్యాండిల్ ర్యాలీలు తీస్తే, మరికొంత మంది మౌనం పాటిస్తున్నారు.

ఇదే కోణంలో ప్రియాంకారెడ్డి దారుణహత్యకు నిరసనగా రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని కూడా మూసివేశారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి 11.20నిమిషాల వరకు ప్రదక్షణలను, దర్శనాలను పూర్తిగా ఆపేసి ఆలయాన్ని మూసివేసారు. 20 నిమిషాల పాటు మూసిన ఆలయాన్ని తెరిచిన తరువాత ఆలయం ఎదుట భక్తులతో మహాప్రదక్షణను చేయిస్తూ 'రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీజాతిని రక్షిద్దాం'అంటూ భక్తులతో పెద్దఎత్తున నినాదాలు చేయించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంగరాజన్‌ మాట్లాడుతూ ఈ కలికాలంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు జరుగుతున్న ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అని ఆందోళన చెందారు. అభం శుభం తెలియని 9 నెలల పసికందు నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ సమాజంలో రక్షణ లేకుండాపోతుందని తెలిపారు. దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని చెప్పారు. మహిళలను గౌరవించాలని, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించకూడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళీ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News