ఆ చిన్నారులు ఏం చేసారో తెలుసా?

నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడిని నిజం చేసారు ఈ చిన్నారు. కొంత మంది పెద్ద వారు కూడా పాటించని నిబంధనలను ఆ చిన్నారులు బుద్ధిగా పాటిస్తున్నారు.

Update: 2020-04-11 07:58 GMT
Childrens Maintaining Social Distance

నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడిని నిజం చేసారు ఈ చిన్నారు. కొంత మంది పెద్ద వారు కూడా పాటించని నిబంధనలను ఆ చిన్నారులు బుద్ధిగా పాటిస్తున్నారు. నిజం చెప్పాలంటే వారి నుంచి కొంత మంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అసులు ఈ చిన్నారులు ఏం చేసారు అనుకుంటున్నారా.. ప్రస్తుతం మన రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించి, ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. అందులో ముఖ్యంగా పాటించవలసింది సామాజిక దూరం.

కొంత మంది పెద్దవారు నిత్యవసర వస్తువులు తేవడానికి బయటికి వెల్లినపుడు అస్సలు సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులు గుంపులుగా ఒకే చోట చేరుతున్నారు. ప్రభుత్వాలు, వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలు వినిపించుకోవడం లేదు. ఇలా చేయడం వలన కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కానీ కొంత మంది చిన్నారు మాత్రం చిరుతిల్లకోసం దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్న గుడులలో నిలుచుని సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.

అలా సామాజిక దూరం పాటిస్తూ చిరుతిళ్లను కొనుక్కున్నారు. ఇప్పుడు ఈ ఫోటోను టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ఈ చిన్నారులు కచ్చితమైన సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని, ఇది ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చిన వారు ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన అన్నారు. ఎక్కువ శాతం ఇండ్లోనే ఉండేందుకు ప్రయత్నించాలని ఆయన ప్రజలను కోరారు.



Tags:    

Similar News