Sunburn Event Cancel: సన్‌బర్న్ ఈవెంట్ కేసులో మరో ట్విస్ట్.. నిర్వాహకుడు సుశాంత్‌పై కేసు

Sunburn Event Cancel: ఈవెంట్ నిర్వహించకుండానే టిక్కెట్లు విక్రయం

Update: 2023-12-27 09:54 GMT

Sunburn Event Cancel: సన్‌బర్న్ ఈవెంట్ కేసులో మరో ట్విస్ట్.. నిర్వాహకుడు సుశాంత్‌పై కేసు

Sunburn Event Cancel: సన్‌బర్న్ హైదరాబాద్ ఈవెంట్‌లో మరో ట్విస్ట్ నెలకొంది. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేస్ నమోదు చేశారు. సన్ బర్న్ పేరుతో సుశాంత్ అలియాస్ సుమంత్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు. సుశాంత్‌పై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేస్ పెట్టారు.

సన్ బర్న్ ఈవెంట్ కు ఎలాంటి అనుమతి రాకున్నా బుక్ మై షో‌లో సన్ బర్న్ పేరుతో టిక్కెట్లు సుశాంత్ విక్రయించాడు. అసలు ఈవెంట్ లేకుండానే బుక్ మై షో లో టిక్కెట్లను సుశాంత్ పెట్టించాడు. సుశాంత్‌పై 420 ఐపీసీ సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేస్ నమోదు చేశారు. చాలా మంది టిక్కెట్లు కొనుగోలు చేసేలా సుశాంత్ చేశాడు. డబ్బులు వసూలు చేసి ఎలాంటి ఈవెంట్ నిర్వహించకుండా సుశాంత్ మోసం చేశాడని మాదాపూర్ పోలీసులు తెలిపారు.

డ్రగ్స్‌ దందాపై ఉక్కుపాదం మోపుతామని CM రేవంత్‌ రెడ్డి ప్రకటించిన తర్వాత, సీన్‌ మారింది. డ్రగ్సేకాదు, మత్తు మరకలతో అంటకాగిన ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని అసెంబ్లీలో CM తేల్చేసిన తర్వాత పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అంతేకాదు న్యూ ఇయర్‌ ముసుగులో జరిగే ఈవెంట్స్‌పైనా నిఘాపెట్టాలన్న రేవంత్‌ ఆదేశాలతో అధికార యంత్రాంగమంతా స్పీడ్‌ పెంచింది. వెంటనే, న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. టికెట్లు అమ్మి ఈవెంట్లు నిర్వహించే సన్‌బర్న్‌, బుక్‌మైషో వంటి సంస్థలకు పోలీస్‌ శాఖ అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్‌ సీపీ మహంతి తేల్చేశారు. సన్‌బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.

ఇక న్యూఇయర్‌ వేడుకల పేరుతో సాగే జల్సాలకు ఎలా చెక్‌ పెడతారన్నదే ఆసక్తిగా మారింది. మొత్తానికైతే, ఈసారి మాటలే కాదు, చేతలు కూడా గట్టిగానే ఉంటాయనే సంకేతాలు వెళుతున్నాయి. దీంతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలతోపాటు, రంగేళీరాజాలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Tags:    

Similar News