Bay of Bengal: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్

Bay of Bengal:ఈ నెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..?

Update: 2021-09-08 05:15 GMT
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం (ఫైల్ ఇమేజ్)

Bay of Bengal: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 11 నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్‌ ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనం మధ్యప్రదేశ్‌కు ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. మరో మూడు, నాలుగు రోజుల పాటు పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ గుజరాత్‌ వరకు సాగే ఛాన్స్‌ ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో.తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని, వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మరోవైపు.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. గాంధారి, తాడ్వాయి, లింగంపేట మండలంలో కురిసిన వర్షాలతో.. పోచారంలోకి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో రెండు గేట్లను ఎత్తి మంజీర నదిలోకి 12వేల 652 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. మంజీర నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు గేట్లను ఎత్తివేయడంతో ప్రాజెక్ట్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. 

Tags:    

Similar News