కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణకు కేంద్రం రూ.456 కోట్లు కేటాయింపు

* పిల్లల రక్షణ చర్యలకు ప్రాధాన్యత * పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా నిలోఫర్ * తెలంగాణలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు

Update: 2021-08-18 03:32 GMT

కరోనా టెస్టులు(ఫైల్ ఫోటో)

Telangana: కరోనా మూడో వేవ్ సమర్ధంగా ఎదుర్కొవడానికి కేంద్ర ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు మొదలు పెట్టింది. శాంపిల్ టెస్టుల దగ్గరి నుంచి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల వరకు ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ ఫేస్ 2 కింద తెలంగాణకు 456 కోట్లు కేటాయించింది. ఇప్పటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఏయే పనులకు నిధులు అవసరమన్న దానిపై రాష్ట్ర వైద్యారోగ్యశాక పంపిన ప్రతిపానలను ఆమోదించింది. మరోవైపు రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అత్యవసర నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 60శాతంగా కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 భరించాల్సి ఉంటుందని పేర్కొంది

ముందస్తు ఏర్పాట్ల ప్రతిపాదనల్లో వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలకు, ప్రధానంగా పీడియాట్రిక్ కేర్ యూనిట్లకు పెద్దపీట వేశారు. ఈ రంగాలకు 270 కోట్లు కేటాయించగా ఇందులో పీడియాట్రిక్ కేర్ యూనిట్ల కోసమే 86.90 కోట్లు ఇచ్చారు. పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిని చేయాలని నిర్ణయించారు. 6 చోట్ల 32 పడకల చొప్పున పిల్లల వార్డులను నెలకొల్పాలని కేంద్రం సూచించింది.

కరోనా మూడో వేవ్ మొదలైతే వెంటనే గుర్తించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా 1.10 కోట్ల యాంటిజెన్ కిట్లను, 30.77 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటికోసం కేంద్రం 92.38 కోట్లు కేటాయించింది. ఆర్టీపీసీఆర్ ఒక్కో కిట్ ధర 50 రూపాయలు కాగా, యాంటిజెన్ కిట్ ధర 70గా నిర్దారించింది. అలాగే ఆర్టీపీసీఆర్ లేబొరేటరీలను బలోపేతం చేసేందుకు 5.10 కోట్ల రూపాయలు అత్యవసర కోవిడ్ మందులు, డయాగ్నస్టిక్ సేవల కోసం 130 కోట్లే కేటాయించారు.

Tags:    

Similar News