హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో కారు బీభత్సం.. డివైడర్‌ పైకి దూసుకెళ్లి బోల్తా పడిన కారు

Hyderabad: ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసుల అనుమానం

Update: 2023-07-07 03:32 GMT

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో కారు బీభత్సం.. డివైడర్‌ పైకి దూసుకెళ్లి బోల్తా పడిన కారు

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‌ పైకి దూసుకెళ్లిన కారు.. చెట్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా.. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని.. కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగంతో పాటు.. డ్రైవర్‌ నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News