Telangana Assembly Polls: ఆగిన ప్రచార రథాలు.. మూగబోయిన మైకులు

Telangana Assembly Polls: ఆగిన ప్రచార రథాలు.. మూగబోయిన మైకులు

Update: 2023-11-28 11:30 GMT

Telangana Assembly Polls: ఆగిన ప్రచార రథాలు.. మూగబోయిన మైకులు

Telangana Assembly Polls: రెండు నెలలుగా సాగిన హోరాహోరి సమరం.. హోరెత్తించిన ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు.. ప్రచారాల పర్వంతో.. బద్దలైన మైకులు.. సభలు.. వేదికలతో దద్ధరిళ్లిన తెలంగాణ మూగబోయింది. తెలంగాణలో ప్రచార ఘట్టం ముగిసింది. అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి.. ప్రచారాలు ఊపందుకున్నాయి. 50 రోజులుగా సాగిన హోరాహోరీ ప్రచారానికి నేటితో తెర పడింది. హామీలు.. గ్యారెంటీ పథకాల భరోసాతో ప్రచారాలు హోరెత్తాయి. కరెంట్, రైతుబంధు, ధరణి అంశాలపై వాడివేడి డైలాగ్ వార్ నడిచింది. రెండు జాతీయ పార్టీల అగ్ర నాయకులు మకాం వేసి... క్యాంపెయిన్ చేయటంతో.. తారా స్థాయికి చేరిన ప్రచార పర్వం ముగిసింది.

Tags:    

Similar News