Madhira: మిషన్ ఇంద్ర ధనస్సుపై కళాకారుల ప్రచారం

రీజనల్ అవుట్రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా కోలాట బృందం టీమ్ లీడర్ రేవూరి దశరథ కళా బృందం కళాకారుల చేత... మిషన్ ఇంద్ర ధనస్సు టీకాల అవగాహన కార్యక్రమం

Update: 2020-02-08 14:28 GMT

మధిర: రీజనల్ అవుట్రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా కోలాట బృందం టీమ్ లీడర్ రేవూరి దశరథ కళా బృందం కళాకారుల చేత... మిషన్ ఇంద్ర ధనస్సు టీకాల అవగాహన కార్యక్రమం శనివారం నిదానపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాటలు, నాటికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డ నుండి అయిదు సంవత్సరాల పిల్లల వరకు ఎన్ని రకాల టీకాలు వేయించుకోవాలి... ఏ టైంలో వేయించుకోవాలో ప్రజలకు వివరించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే టీకాలు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస్, సూపర్ వైజర్ మర్యరాణి, ఏఎన్ఎంలు మరియమ్మ, రాజ్యలక్ష్మి, పద్మావతి, కళాబృందం సభ్యులు వేణు, నాగేశ్వరరావు, జయమ్మ, మల్లేశ్వరి, నాగమ్మ, ధనలక్ష్మి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News