OBC Bandh: బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్‌కు పిలుపు: భట్టి విక్రమార్క
సైంటిఫిక్‌గా తొలిసారి కులగణన చేయించాం ఆ సమాచారంతో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నాం బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లో ఉంది - భట్టి విక్రమార్క
OBC Bandh: బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్‌కు పిలుపు: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు.. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తొలిసారిగా సైంటిఫిక్‌గా తెలంగాణలో కులగణన నిర్వహించామని తెలపారు. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు. తాము పాస్ చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా.. అడ్డుకట్ట వేసి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతోందని ఆరోపించారు. ఇది బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు భట్టి. బీజేపీ వలనే బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రంలో ఓబీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయన్నారు. ఓబీసీల బంద్‌లో అన్ని పార్టీల సంఘాలు ఆమోదం తెలిపాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు.