తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఈ రోజు రాష్ట్ర మంత్రిమండలి ప్రత్యేక సమావేశం ప్రారంభమయింది.

Update: 2020-04-11 11:38 GMT
KCR (file photo)

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఈ రోజు రాష్ట్ర మంత్రిమండలి ప్రత్యేక సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిన అరికట్టేందుకు తీసుకోవలసిన మరిన్ని ముఖ్యమైన చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది. ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు తలెత్తిన పరిస్థితులపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.

అందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రాష్టంలోని పేదలు, కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించే అంశం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు పడే కష్టాలు, వారికి ప్రభుత్వం అందిస్తున్న సాయం, వడగండ్ల వాన-నష్టం, రైతుల ఆందోళన, భవిష్యత్ వ్యూహ రచన, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు లాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపునకు సీఎం కేసీఆర్‌ సుముఖంగా ఉన్నారు. ఇక పోతే దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. శనివారం సాయంత్రంలోగా కొత్త మార్గదర్శకాలతో స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పొడగింపు విషయంపై శనివారం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్ పొడగింపుకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపుగా మొగ్గు చూపినట్లు సమాచారం. వారితో తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. ఆయన కూడా లాక్ డౌన్ పొడగింపుకు అనుకూలంగానే మాట్లాడారు.

Tags:    

Similar News