KTR: GHMC బీఆర్ఎస్‌ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం

KTR: రేపు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కార్పొరేటర్లతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు.

Update: 2025-11-24 09:07 GMT

 KTR: GHMC బీఆర్ఎస్‌ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం

KTR: రేపు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కార్పొరేటర్లతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డితో పాటు నగర పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారంటూ కార్పొరేటర్లకు పార్టీ తరఫున కేటీఆర్ అభినందనలు తెలిపారు.

నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తీరును అభినందించారు. ప్రత్యేకంగా ప్రస్తావించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికల్లో పోరాడారని.. పార్టీ వెంట నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను పార్టీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News