కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను అసెంబ్లీలో ఎండగట్టాలి: బీఆర్ఎస్‌ఎల్పీ భేటీలో కేసీఆర్

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సమయంలో అన్ని అంశాలపై అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు.

Update: 2025-03-11 14:41 GMT

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను అసెంబ్లీలో ఎండగట్టాలి: బీఆర్ఎస్‌ఎల్పీ భేటీలో కేసీఆర్

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సమయంలో అన్ని అంశాలపై అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు. బీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగింది. బీఆర్ఎస్ హయంలో తీసుకువచ్చిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు. రేవంత్ సర్కార్ ఎంత అప్పులు తెచ్చిందనే విషయమై అసెంబ్లీలో ప్రస్తావించాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు.

అసెంబ్లీ సమావేశాలకు అరగంట ముందుగానే హాజరుకావాలని కేసీఆర్ కోరారు. అసెంబ్లీకి వెళ్లే ముందు అసెంబ్లీ ఆవరణలోని పార్టీ శాసనసభపక్ష కార్యాలయంలో ఏ అంశాలపై సభలో మాట్లాడాలనే దానిపై చర్చించుకోవాలని ఆయన కోరారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తాను కూడా హాజరౌతానని కేసీఆర్ చెప్పారు.

హామీల అమలులో కాంగ్రెస్ ఏ రకంగా వైఫల్యం చెందిందో చట్టసభల్లో ఎండగట్టాలని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలను కోరారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సూచించారు.

Tags:    

Similar News