KTR: ఈ నెల 8న సింగ‌రేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్ మ‌హా ధ‌ర్నాలు.. పిలుపునిచ్చిన కేటీఆర్

KTR: యూటర్న్ తీసుకున్న కేంద్రానికి గుణపాఠం చెప్పాలి

Update: 2023-04-06 15:00 GMT

KTR: ఈ నెల 8న సింగ‌రేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్ మ‌హా ధ‌ర్నాలు.. పిలుపునిచ్చిన కేటీఆర్

KTR: సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధమైంది బీఆర్ఎస్.. ఈ మేరకు ఈ నెల 8న ధర్నాలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో మహా ధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు...సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండం వేదికగా ప్రధాని మోడీ మాట ఇచ్చి తప్పారని కేటీఆర్ మండిపడ్డారు.. సింగరేణిపై యూటర్న్ తీసుకున్న కేంద్రానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు... ఈ నెల 8న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు.. ఈ నేపథ్యంలో... అదే రోజు... కేటీఆర్ ధర్నాలకు పిలుపునివ్వడం పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News