BRS Plenary: ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ

BRS Plenary: ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి

Update: 2023-03-21 06:28 GMT

BRS Plenary: ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ

BRS Plenary: ఏప్రిల్ 27వ తేదీన బిఅరెస్ పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నారు. ప్లీనరీకి   పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరుకానున్నరు. అదే రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించనున్నారు. .ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గస్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.ఈ మేరకు మత్రి కేటీఆర్ పలువురు పార్టీ నాయకులు మంత్రులతో సమావేశమయ్యారు.అకాల వర్షాల వలన సమస్యలు ఎదుర్కొంటున్నరైతులను 'స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి పరామర్శించాలని ప్రజా ప్రతినిధులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

అకాలవర్షాలకు పంటలు నష్టపోయిన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతులకు భరోసా ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశం పైనా దృష్టి సారించి వర్షాకాలం లోపల పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ఉపాధి హామీతో పాటు పంచాయతీరాజ్ శాఖ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపు పైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే జిల్లా ఇన్ ఛార్జ్ లగా వెళ్లిన వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు. దాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలని, ప్రతి కార్యకర్తకు ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలందరికీ కేసీఆర్ పంపిన సందేశాన్ని వినిపించాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రల హక్కుల విషయంలో చేస్తున్న అన్యాయం పై ప్రజలకు వివరించేలా కార్యాచరణ పై దృష్టి సారించేలా కేటీఆర్ సూచనలు చేశారు.

Tags:    

Similar News