Malla Reddy: కిషన్ రెడ్డితో నాకు 30 ఏండ్లుగా పరిచయం ఉంది
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు MLA రాజశేఖర్ రెడ్డి.. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు.
Malla Reddy: కిషన్ రెడ్డితో నాకు 30 ఏండ్లుగా పరిచయం ఉంది
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు MLA రాజశేఖర్ రెడ్డి.. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. మల్లారెడ్డి మనమరాలు వివాహ ఆహ్వాన పత్రికను కిషన్ రెడ్డికి అందజేశారు. కిషన్ రెడ్డితో తనకు 30 ఏండ్లుగా పరిచయం ఉందన్నారు మల్లారెడ్డి. అందుకే తన మనవరాలి పెళ్లికి పిలవడానికి వచ్చానన్నారు.
రాజకీయ అంశాలేమీ మాట్లాడలేదన్నారు. ప్రతిసారి అవే ముచ్చట్లు కావాలా అని అన్నారు. టీడీపీలో చేరబోతున్నారా అని మీడియా ప్రతినిధులు అడగగా..చంద్రబాబు నాకు రాజకీయ భిక్ష పెట్టాడని, ఆయన దయవల్ల నేను ఎంపీ అయ్యానని, బీజేపీ, టీడీపీ పొత్తు వల్ల ఆనాడు పార్లమెంట్ కు వెళ్ళానని గుర్తుచేశారు.