Kishan Reddy: తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయింది
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాట్‌కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాట్‌కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో త్రిముఖ పోటీ ఉంటుందన్న కిషన్‌రెడ్డి.. తెలంగాణ టీడీపీ, జనసేన స్థానిక నేతల సహకారంతో జూబ్లీహిల్స్ బైపోల్‌లో కింగ్ అవుతున్నామని చెప్పారు. బూతుస్థాయి కార్యకర్తలే తమ బలమన్న కిషన్‌రెడ్డి.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం తమకే మంచిదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ చేసిందేమీ లేదని, అందుకే ఎక్కడికి వెళ్లినా ఫ్రీ బస్సు గురించే పదే పదే చెబుతున్నారని విమర్శించారు. ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో అక్రమాలు జరిగితే.. రెండేళ్ల నుంచి కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.