BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించి.. బైపోల్‌కు శంఖం పూరించింది.

Update: 2025-09-26 07:06 GMT

BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించి.. బైపోల్‌కు శంఖం పూరించింది. అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో, అనివార్యమైన ఉప ఎన్నిక విజయంపై బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది.

జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నియోజకవర్గ ప్రజలు అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్నారు. అందువల్ల మాగంటి సునీతకే ప్రాధాన్యమిస్తూ.. అభ్యర్థిగా ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ, జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News