Indiramma Canteens: హైదరాబాద్ వాసులకు ఆగస్టు 15 కానుక.. రూ.5కే, 6వెరైటీలు
Indiramma Canteens: పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలవాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ.5కే భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలో, ఇప్పుడు అదే ధరకు అల్పాహారంను కూడా అందించేందుకు సిద్ధమైంది.
Indiramma Canteens: ఆగస్టు 15 నుంచి ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం
Indiramma Canteens: పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలవాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ.5కే భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలో, ఇప్పుడు అదే ధరకు అల్పాహారంను కూడా అందించేందుకు సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు, ఆగస్టు 15 నుంచి ఈ సేవను ప్రారంభించనున్నారు.
రూ.5కే ఆరోగ్యకర అల్పాహారం
జీహెచ్‌ఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు, ఉదయం టిఫిన్‌ను నామమాత్ర ధరకు అందించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఒక్కో టిఫిన్ తయారీకి రూ.19 ఖర్చు అయ్యే అవకాశం ఉన్నా, లబ్ధిదారుడు కేవలం రూ.5 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.14ను హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు జీహెచ్‌ఎంసీ చెల్లించనుంది.
కొత్త డిజైన్‌తో క్యాంటీన్లు
ఇందిరమ్మ క్యాంటీన్ల నమూనాను కూడా జీహెచ్‌ఎంసీ మెరుగుపరిచింది. 40/10, 20/10 పరిమాణాల్లో నూతన కేంద్రాలు డిజైన్ చేసినట్టు సమాచారం. పెద్ద విస్తీర్ణంతో వడ్డింపుకు సౌలభ్యం కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఓ నమూనా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కూడా పనులు తుది దశలో ఉన్నాయి.
క్యాంటీన్లపై GHMC లోగో, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, CM రేవంత్ రెడ్డి ఫొటోలు, భోజన చిత్రాలు దర్శనమిస్తాయి.
టిఫిన్ మెనూ (రోజువారీ):
(గ్రా: గ్రాములు, ఎంఎల్: మిల్లీ లీటర్లు)
డే 1: మిల్లెట్ ఇడ్లీ – 3 (ఒక్కొక్కటి 45 గ్రా), సాంబార్ – 150 ఎంఎల్, పొడి – 15 గ్రా
డే 2: మిల్లెట్ ఉప్మా – 250 గ్రా, సాంబార్ – 150 ఎంఎల్, చట్నీ/మిక్చర్ – 25 గ్రా
డే 3: పొంగల్ – 250 గ్రా, సాంబార్ – 150 ఎంఎల్, మిక్చర్ – 25 గ్రా
డే 4: ఇడ్లీ – 3 (ఒక్కొక్కటి 45 గ్రా), సాంబార్ – 75 ఎంఎల్, చట్నీ – 75 గ్రా
డే 5: పొంగల్ – 250 గ్రా, సాంబార్ – 150 ఎంఎల్, మిక్చర్ – 25 గ్రా
డే 6: పూరి – 3 (45 గ్రా), ఆలు కూర్మ – 100 గ్రా
ఆదివారం సెలవు, మిగిలిన 6 రోజులూ అల్పాహారం అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుత క్యాంటీన్ స్థితి
గతంలో 150 భోజన కేంద్రాలు ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ, ప్రస్తుతం 128 కేంద్రాలను సక్రియంగా నిర్వహిస్తోంది. ప్రతీ డివిజన్‌కు కనీసం ఒక్క కేంద్రం ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.