Corona Vaccine: తెలంగాణ లో అన్ లాక్ వేళ వ్యాక్సినేషన్ కొరత?

Corona Vaccine: తెలంగాణ లో హై రిస్కులో ఉన్న వృత్తికారులకు ఇస్తున్న టీకాల ప్రక్రియ ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుందట.

Update: 2021-06-16 04:29 GMT

Corona Vaccine in Telangana:(The Hans India)

Corona Vaccine: ఒకవైపు తెలంగాణలో అన్ లాక్ ప్రక్రియ నడుస్తోంది. 20వ తేదీ తర్వాత నైట్ కర్ఫ్యూ కే మాత్రం పరిమితం కాబోతుంది తెలంగాణ. జూలై 1 వ తేదీ నుంచి మొత్తం అన్నీ ఓపెన్ చేసే ఆలోచనలు చేస్తున్నారు. ఈ లోపు వ్యాక్సినేషన్ చాలావరకు అవుతుందని.. అందువల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించారు. కాని ఇప్పుడు వ్యాక్సినేషన్ స్టాక్స్ సరిపడా లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న స్టాక్ కేవలం మరో రెండురోజులు అంటే జూలై 17 వరకు మాత్రమే వచ్చే అవకాశం కనపడుతోంది. ఇంకా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించినవారికే వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. వ్యాక్సినేషన్ పూర్తి కాకపోతే.. అన్నీ అన్ లాక్ చేస్తే.. థర్డ్ వేవ్ విరుచుకుపడీతే.. అమ్మో ఊహించడానికే భయమేస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రం వద్ద అందుబాటులో ఏడున్నర లక్షల టీకాల మాత్రమే ఉన్నాయి. అయితే అవి పూర్తయిన తర్వాత వ్యాక్సినేషన్ ఎట్లా అనేది ఇప్పుడు వైద్యారోగ్య శాఖ అధికారుల్ని వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం స్వయం సహాయక మహిళా బృందాలకు, కొద్దిమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వృత్తికారులకు ఇస్తున్న టీకాల ప్రక్రియ ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే అప్పటివరకూ కొత్త రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఆ ప్రకారం వ్యాక్సినేషన్‌ కొనసాగనుంది.

ఈ డోసులు అయిపోతే కొత్తగా కేంద్రం నుంచి వచ్చేవాటిపైనే రాష్ట్రం ప్రభుత్వం నమ్మకం పెట్టుకుంది. అయితే కేంద్రం నుంచి ఎన్ని డోసులు వస్తాయో ఇంకా క్లారిటీ లేనందువల్ల వచ్చిన తర్వాతే తదుపరి ప్లానింగ్ చేసుకోవాలని వైద్యాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 81.66 లక్షల మందికి టీకాల పంపిణీ పూర్తయింది.

ప్రధాని మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా జూన్ 21 నుంచి వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సి ఉంది. కానీ రాష్ట్రం దగ్గర టీకాలు లేకపోవడంతో ఆ ప్రక్రియ లాంఛనంగా మాత్రమే ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. ఒకవేళ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో కోటా వచ్చినట్లయితే పూర్తిస్థాయిలోనే ఈ ప్రక్రియ జరుగుతుందని, రాని పక్షంలో నిర్వహించడం కష్టమేనని అధికారుల భావిస్తున్నారు.

Tags:    

Similar News