Khammam: వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి

Khammam: పిల్లలతో ఆడుకుంటుండగా బాలుడిపై కుక్కల దాడి

Update: 2023-03-13 13:31 GMT

Khammam: వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి

Khammam: ఖమ్మం మండల పరిధిలోని పుటాని తండాలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు బానోతు శరత్‌ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం పిల్లలతో ఆడుకుంటుండగా వీధి కుక్కులు బాలుడిపై దాడి చేశాయి. దీంతో తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని సూచించారు. వెంటనే బాలుడిని హైదరాబాద్‌కు తరలించే క్రమంలో సూర్యాపేట సమీపంలోనే ప్రాణాలు విడిచాడు. బాలుడి తల్లిదండ్రల రోదనలు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోని వీధి కుక్కులను నియంత్రించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. 

Tags:    

Similar News