భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలుడిపై పెంపుడు కుక్క దాడి

* దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు జితేందర్

Update: 2023-04-02 11:31 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలుడిపై పెంపుడు కుక్క దాడి

Bhadradri Kothagudem: రాష్ట్రవ్యాప్తంగా కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు మండల కేంద్రంలోనూ చోటుచేసుకుంది. జూలూరుపాడు గ్రామ పంచాయతీ సమీపంలో ఆటో డ్రైవర్ బానోత్ వినోద్ కుటుంబంతోపాటు నివాసం ఉంటున్నాడు. అయితే అతని కుమారుడు ఐదేళ్ల జితేందర్ ఆరుబయట ఆడుకునేందుకు వెళుతున్న సమయంలో వేరొకరి ఇంట్లోని పెంపుడు కుక్క బాలుడిపై దాడి చేసింది. దీంతో బాబు రెండు కళ్ల పైభాగంతో పాటు చేతికి, కాలికి గాయాలయ్యాయి. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఆ చిన్నారిని జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Tags:    

Similar News