బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ ఆందోళన
* బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ ఆందోళన
Yadadri: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను తుర్కపల్లి, కీసర్ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. బొమ్మలరామారంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. బండి సంజయ్‌ను వరంగల్‌కు తరలించే అవకాశముంది. మరోవైపు తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ లోక్‌సభ స్పీకర్‌కు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. అరెస్ట్ వ్యవహారాన్ని ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి బీజేపీ అధిష్టానం తీసుకెళ్లింది. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్.. పాలన చేతగాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసిందని బీఎల్ సంతోష్ విమర్శించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని.. రాజకీయంగా సమాధి అయ్యే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. బండి అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది.
అర్థరాత్రి కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 151 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి.. ప్రివెంట్ మోషన్ కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బొమ్మలరామారం పీఎస్ లో ఉన్న బండి సంజయ్ ను.. వరంగల్ తీసుకెళ్లే అవకాశముంది.
బండి అరెస్ట్ పై హెచ్ఎంటీవీతో మాట్లాడారు ఆయన సతీమణి అపర్ణ. ఒక్కసారిగా దాదాపు 40 మంది పోలీసులు ఇంటికి వచ్చారన్నారన్నారు. బండి సంజయ్ ని ఎలాగైనా అరెస్ట్ చేయమని సీపీ ఆదేశాలుగా పోలీసులు చెప్పినట్లు తెలిపారు. అరెస్ట్ వారెంట్ చూపించకుండా సంజయ్ ను అరెస్ట్ చేశారన్న అపర్ణ.. బీజేపీ కార్యకర్తలను పోలీసులు బూటుకాలుతో తన్నారన్నారు. ఒక ప్రజాప్రతినిధిని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.