Raghunandan Rao: ఎవరి ప్రయోజనాల కోసం ఎంఐఎం పోటీ చేయడం లేదు
Raghunandan Rao: ఎంఐఎం పార్టీపై ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు.
Raghunandan Rao: ఎంఐఎం పార్టీపై ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు. భాగ్యనగరంలో పుట్టిన ఎంఐఎం పార్టీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో ఎందుకు లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం.. రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఎంఐఎం పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే ఎంఐఎం పోటీకి దూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌తో ఎంఐఎం చీకటి ఒప్పందం చేసుకుందా..? లేక బీఆర్‌ఎస్‌తో ఒప్పందం చేసుకుందా..? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్.