Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
Rajasingh: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆయన్ను అరెస్ట్ చేశారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. నిన్న జరిగిన ఘర్షణలో గాయపడి..ప్రస్తుతం మియాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని రాజాసింగ్ పరామర్శించారు. అనంతంరం పోలీసులు రాజాసింగ్‌ను మియాపూర్ నుంచి గోషామహల్‌లోని ఆయన నివాసానికి తరలించి గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది.