Alleti Maheshwar Reddy: అదే జరిగితే 48 గంటల్లో రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..
Alleti Maheshwar Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Alleti Maheshwar Reddy: అదే జరిగితే 48 గంటల్లో రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..
Alleti Maheshwar Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మా ఎమ్మెల్యేలలో ఒక్కరిని టచ్ చేసినా... 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మీతో టచ్‌లో ఉన్నాడో లేడో తెలుసుకో అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి.
నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి అన్నది వాస్తవం. అయితే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆయనతో లేడు అంటూ కామెంట్స్ చేశారు. భువనగిరి ఎంపీ టికెట్ రాజగోపాల్ రెడ్డి సతీమణికి ఇస్తామని అధిష్ఠానం చెబితే.. వెంకట్ రెడ్డి అడ్డుపడ్డారని అన్నారు.