Bhatti Vikramarka: తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీ.. 30 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్

Bhatti Vikramarka: ప్రధాని మోడీకి భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

Update: 2023-04-07 07:38 GMT

Bhatti Vikramarka: తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీ.. 30 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్

Bhatti Vikramarka: మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీ.. 30 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు.

2014నుంచి తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా? ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలు ఎన్ని నెరవేర్చారంటూ నిలదీశారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకుని.. రాజకీయం చేస్తుంది నిజమా? కాదా? అని అడిగారు.

Tags:    

Similar News