భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గత 15 రోజులుగా వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2020-04-09 08:30 GMT
Bhadadri Ramayya Brahmotsavalu (File Photo)

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గత 15 రోజులుగా వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా పూర్ణాహుతితో బుధవారం ఈ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల్ సమయంలో పౌర్ణమి సంభవించడంతో ఆలయంలో స్వామివారికి చక్రస్నానం, స్నపన తిరుమంజనం నిర్వహించారు.ఇందులో భాగంగా స్వామి వారి ఉత్సవ మూర్తులను బుధవారం ఉదయం ఆలయం నుంచి బయటికి తీసుకు వచ్చి బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆశీనులను చేశారు. ఆ తరువాత ముత్తైదువులు రోకలికి, రోలుకి ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచారు.

అనంతరం స్వామి వారికి చూర్ణోత్సవం, జలద్రాణి ఉత్సవం, నవకలశ స్నపనం జరిపించారు. ఆ తరువాత సుదర్శన చక్రాన్ని ఆచార్యులు శిరస్సుపై ధరించి ఆలయంలో ఏర్పాటు చేసిన గంగాళంలో అభిషేకం నిర్వహించారు. పవిత్ర గోదావరిలో భక్తుల మధ్య కోలాహలంగా నిర్వహించాల్సిన చక్రతీర్ధం కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. అనంతరం ఆలయ చుట్టూ ఉత్సవ మూర్తులను 12 రకాలుగా ప్రదక్షిణ నిర్వహించి, 12 రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా పెట్టారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేసారు. ఇక చివరగా మహా కుంభ ప్రోక్షణను'ఫృథవీశాంత' అనే మంత్రంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు సమాప్తం అయ్యాయి.

ఇక గురవారం నుంచి స్వామి వారికి నిత్యం జిరగే కైంకర్యాలను, దశవిధ ఉత్సవాలను, దర్బార్‌ సేవలను నిర్వహించనున్నామని ఆలయ అధికారులు, ప్రధాన అర్ఛకులు తెలిపారు. కేవలం పవళింపు సేవను నిలిపివేస్తామన్నారు. ఎడబాటు ఉత్సవం, నూతన పర్యంకోత్సవ సేవలను ఈనెల 16న ఉంటాయని తెలిపారు. ఇక స్వామివారి ఏకాంత సేవను 16 రోజుల పండుగ రోజు నిర్వహిస్తామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఈ విధంగా నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని పండితులు చెపుతున్నారు.


Tags:    

Similar News