HariPriya: పొంగులేటిపై ఎమ్మెల్యే హరిప్రియ ఘాటు వ్యాఖ్యలు...
MLA HariPriya: సొంత ఇంటినే కూల్చేందుకు కొందరు సిద్ధమవుతున్నారు
MLA HariPriya: ఎలక్షన్ల ముందు నీచరాజకీయాలకు తెరలేపాలని చూస్తున్నారు
MLA HariPriya: ఖమ్మం బీఆర్‌ఎస్‌లో మాటల తుటాలు పేలుతున్నాయి. ఇల్లందు ఆత్మయ సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ హాట్ కామెంట్స్ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే హరిప్రియ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యోజకవర్గంలో ఎప్పుడూ తిరగని వ్యక్తి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇల్లందులో తిరుగుతున్నాడని చెప్పారు. ఎలక్షన్ల ముందు నీచరాజకీయాలకు తెరలేపాలని చూస్తున్నారని ఆరోపించారు. జడ్పీఛైర్మన్ పదవిని కట్టబెడితే కొందరు స్వార్థం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారని విమర్శించారు. ధనబలాన్ని, జనబలంగా చూపిస్తూ పరామర్శల పేరిట సొంత ఇంటినే కూల్చేందుకు కొందరు సిద్ధమవుతున్నారని పొంగులేటిని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే హరిప్రియ విమర్శలు గుప్పించారు. వారికి ధనబలం ఉంటే మాకు ప్రజాబలం ఉందన్నారు.