Srisailam: శ్రీశైలం భక్తుల సేవలో బ్యాటరీ వాహనాలు

Srisailam: వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డ తల్లులకు బ్యాటరీ వాహనాల సేవలు

Update: 2023-08-04 03:57 GMT

Srisailam: శ్రీశైలం భక్తుల సేవలో బ్యాటరీ వాహనాలు

Srisailam: శ్రీశైల మల్లన్న దర్శనార్థవచ్చే భక్తుల సేవలో బ్యాటరీ వహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. శ్రీశైలం వచ్చి స్వామివారి దర్శనంకోసం వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లులు ఇబ్బంది పడకుండా బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలు కనక దుర్గ 1,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1, యూనియన్ బ్యాంక్ 2 తాడేపల్లి చెందిన దాత 1 ఇలా మొత్తం ఐదు బ్యాటరీ వాహనాలను సమకూర్చారు.

ఉచిత క్యూలైన్లు శీఘ్ర ,అతి శీఘ్ర క్యూ లైన్లు, ఆర్జిత సేవల క్యూ లైన్లు, అన్నదాన భవనము, లడ్డు కౌంటర్, నంది సర్కిల్, గంగాధరం మండపం వరకు కూడా ఈ బ్యాటరీ వాహనాల ద్వారా ఉచితంగా ప్రయాణించే విధంగా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. దేవస్థానం పరిసర ప్రాంతంలోనే కాక సత్ర సముదాయాల వద్ద కూడా ఈ బ్యాటరీ వాహనాలతో సేవలు అందిస్తున్నారు.

Tags:    

Similar News