తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ అస్తిత్వం, ఆభరణం.. పల్లె బతుకుల పూల సంబురం సద్దుల బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. తీరొక్క పువ్వులతో లొగిళ్లు పూల వనాలుగా మారి.. ఉయ్యాల పాటలతో మార్మోగాయి.

Update: 2020-10-24 15:44 GMT

తెలంగాణ అస్తిత్వం, ఆభరణం.. పల్లె బతుకుల పూల సంబురం సద్దుల బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. తీరొక్క పువ్వులతో లొగిళ్లు పూల వనాలుగా మారి.. ఉయ్యాల పాటలతో మార్మోగాయి. ఆత్మీయతకు అనుబంధానికి అద్దం పట్టేలా మహిళలందరు బతుకమ్మలతో ఓ చోట చేరి ఆటపాటలతో సందడి చేశారు.

వరంగల్‌లోని ప్రతీ ఆడపడుచు సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో గౌరమ్మను పూజించిన మహిళలు చివరి రోజు సద్దుల బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ వేడుకలల్లో ఉత్సహంగా పాల్గొన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ ఎంతో ఉత్సహాంగా పాటలుపాడి భక్తితో బతుకమ్మ ఆడారు .

అటు ఆటపాటలతో ఆడపడుచులు హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలతో నగరంలోని కాలనీలల్లో సందడి నెలకొంది. వాడవాడనా ఓ చోట చేరిన అతివలు తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన సంబురాల్లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మహిళా సిబ్బందితో కలిసి ఆడిపాడారు.

Tags:    

Similar News