Telangana Lockdown: రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో బ్యాంకుల పని వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
Telangana Lockdown: రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో బ్యాంకుల పని వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రాష్ట్రాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేయాలంటూ సమావేశంలో పలువురు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపింది.మారిన బ్యాంకు వేళలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్గదర్శకాలు జూన్ 9 వరకు అమల్లో ఉండనున్నాయి.