Vasantha Panchami 2026: బాసర పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన వసంత పంచమి ఉత్సవాలు
Vasantha Panchami 2026: చదువుల తల్లి కొలువు తీరున బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Vasantha Panchami 2026: చదువుల తల్లి కొలువు తీరున బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా... మొదటి రోజు ప్రత్యేక పూజలతో వేడుకలు మొదలైయ్యాయి. ఈ నెల 23వ తారీఖున వసంత పంచమి సందర్భంగా 25 వేల మంది భక్తులు హాజరైయ్యే అవకాశం ఉండడంతో... భక్తుల వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష, ఎస్పీ జానకి షర్మిల కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు. మండపాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని, భక్తులకు అవసరకార్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు అధిక సంఖ్యలో జరిగే అవకాశం ఉండడంతో... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.