hmtv చేతిలో బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్

hmtv చేతిలో బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్

Update: 2023-04-05 12:20 GMT

hmtv చేతిలో బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్

Bandi Sanjay: టెన్త్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రిమాండ్ రిపోర్ట్‌‌లో... ఏ-1గా బండి సంజయ్‌ను చేర్చారు పోలీసులు. అలాగే..ఏ2గా ప్రశాంత్, ఏ-3గా మహేశ్, ఏ-4గా బాలుడు, ఏ-5గా శివ గణేశ్ ఏ6గా పోగు సురేశ్‌, ఏ7గా పోగు శ‌శాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోత‌బోయిన వ‌సంత్ పేర్లను చేర్చారు. కాగా ఈ కేసులో A2గా ఉన్న ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఉదయం 10.41 నిమిషాలకు, బండి సంజయ్ కు 11.24 నిమిషాలకు పేపర్ వాట్సప్ ద్వారా పంపించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

అయితే 9.30 నిమిషాలకే పేపర్ బయటకు వచ్చినట్లు ప్రశాంత్ తప్పుడు ప్రచారం చేశాడని..పేపర్ పంపిన తరువాత ప్రశాంత్ ఏకంగా 149 మందితో మాట్లాడాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశ్యంతోనే బండి సంజయ్ , ప్రశాంత్ కలిసి కుట్ర పన్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు.

Tags:    

Similar News