Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే హిందూ ఆలయాలు.. ముస్లిం మందిరాలవుతాయి
Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే హిందూ ఆలయాలు.. ముస్లిం మందిరాలవుతాయి
Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టోపీ పెట్టుకునే రోజు వస్తే నా తల నరుక్కుంటా కాని టోపి పెట్టుకోన్నారు. నేను హిందువును... టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చను అని తెలిపారు. మాగంటి గోపీనాథ్ మృతికి కేటీఆరే కారణమని గోపీనాథ్ తల్లి ఓ వీడియోలో చెప్పారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగితే 9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో ఏది గెలిచిన హిందూ ఆలయాలు ముస్లింలు మందిరాలు అవుతాయని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ది జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.